సీపీఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.) భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 26 సందర్భంగా రాష్ట్రాలు, జిల్లాల వారీగా సీపీఐ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
సీపీఐ పార్టీ


హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)

ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 26 సందర్భంగా రాష్ట్రాలు, జిల్లాల వారీగా సీపీఐ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్లో రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ భారత గడ్డపై ఆవిర్భవించి నేటికీ వందేళ్లు అవుతోందని అన్నారు.

తాము ఎప్పుడూ ప్రజల పక్షమే వహిస్తామని, ప్రజల సమస్యలపై ప్రభుత్వాలపై పోరాడుతామని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande