శ్రీవారి సేవలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్
తిరుమల, 26 డిసెంబర్ (హి.స.)ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ఆయన తిరుమలకు చేరుకున్నారు. భగవత్ కు, కేంద్ర మంత్రికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఏకే సింఘాల్, అ
శ్రీవారి సేవలో ఆరెస్సెస్ చీఫ్.. చంద్రబాబుతో కలిసి కీలక కార్యక్రమంలో పాల్గొననున్న మోహన్ భగవత్


తిరుమల, 26 డిసెంబర్ (హి.స.)ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ఆయన తిరుమలకు చేరుకున్నారు. భగవత్ కు, కేంద్ర మంత్రికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఏకే సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. స్వామివారి మండపం వరకు స్వయంగా తీసుకెళ్లి, మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. శేషవస్త్రం కప్పి, తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీవారి చిత్రపటం, టీటీడీ క్యాలెండర్, డైరీని బహూకరించారు.

మరోవైపు, ఈరోజు జాతీయ సంస్కృత వర్సిటీ వైజ్ఞానిక సమ్మేళనం జరగనుంది. ఈ సమ్మేళనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్, జితేంద్ర సింగ్ పాల్గొననున్నారు. ఈ ఆధునిక సమాజంలో వేదాలు, సంస్కృతం, శాస్త్రాల ప్రాముఖ్యత తెలియజేసేలా ఈ కార్యక్రమం జరగనుంది. ఖగోళ శాస్త్రం, భారతీయ విజ్ఞానం, వైభవం, శాస్త్ర సాంకేతిక అధ్యయనాలపై వక్తలు ప్రసంగిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande