మనుషులందరికీ సౌఖ్యం.. సదుపాయాలు కావాలి : మోహన్ భగవత్
తిరుపతి, 26 డిసెంబర్ (హి.స.) మనుషులందరికీ సౌక్యం... సదుపాయాలు కావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ లో భగవత్ ప్రసంగిస్తూ శాస్త్ర విజ్ఞానంతోనే కలుగుతాయన్నారు. మానవాళికి సదుపాయాలు సుఖం అనేది కేవల
మోహన్ భగవత్


తిరుపతి, 26 డిసెంబర్ (హి.స.)

మనుషులందరికీ సౌక్యం...

సదుపాయాలు కావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ లో భగవత్ ప్రసంగిస్తూ శాస్త్ర విజ్ఞానంతోనే కలుగుతాయన్నారు. మానవాళికి సదుపాయాలు సుఖం అనేది కేవలం కూడా భౌతికపరమైనది కాదని స్పష్టం చేశారు. సుఖం అనేది కేవలం మానసికపరమైనదని తెలిపారు. సుఖదు:ఖాలు తాత్కాలికమైనవని పేర్కొన్నారు. మనం పొందుతున్న సౌక్యం, సదుపాయాల్లో రెండో కోణం ఉంటుందన్నారు. మనమంతా ఈ విశ్వాసానికి ఎంతో కొంత రుణపడి ఉన్నామన్నారు. మానసికంగా సంతృప్తి లేకపోతే ఎంత పొందినా సుఖం కలగదన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande