దిక్కుతోచని ప్రయాణికులు.. విమానాల నుంచే ‘విషెస్’‌
ఢిల్లీ.31, డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల వేళ అందరినీ నిరుత్సాహ పరిచే వాతావరణం ఏర్పడింది. 2026 న్యూ ఇయర్‌ వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో దట్టమైన పొగమంచు ఢిల్లీని కమ్మేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) ప
Delhi Air Pollution


ఢిల్లీ.31, డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల వేళ అందరినీ నిరుత్సాహ పరిచే వాతావరణం ఏర్పడింది. 2026 న్యూ ఇయర్‌ వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో దట్టమైన పొగమంచు ఢిల్లీని కమ్మేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) పరిసరాల్లో దృశ్యమానత (Visibility) గణనీయంగా పడిపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. శీతాకాలపు చలి తీవ్రతకు పొగమంచు తోడవడంతో రాజధాని ప్రజలు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పొగమంచు ప్రభావంతో దేశంలోని ప్రధాన విమానయాన సంస్థలైన ఇండిగో, స్పైస్‌జెట్,ఎయిర్ ఇండియా మొదలైనవి తమ విమాన సర్వీసుల్లో జాప్యం జరుగుతున్నదని వెల్లడించాయి. తక్కువ దృశ్యమానత కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్నింటిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ‘క్యాట్ III’ ప్రమాణాలకు అనుగుణంగా లేని విమానాలు ల్యాండింగ్, టేకాఫ్‌లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, దీనివల్ల షెడ్యూల్‌లో మార్పులు తప్పవని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande