ఎస్‌ఎస్‌ఎల్వీ మూడో స్టేజ్‌ పరీక్ష విజయవంతం
ఢిల్లీ.31, డిసెంబర్ (హి.స.) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) (ISRO) మరో ముందడుగు వేసింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) మూడో దశ (SS3)ను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC)లోని సాలిడ్ మోటార్ స్టాటిక్‌
ISRO


ఢిల్లీ.31, డిసెంబర్ (హి.స.) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) (ISRO) మరో ముందడుగు వేసింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) మూడో దశ (SS3)ను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC)లోని సాలిడ్ మోటార్ స్టాటిక్‌ టెస్ట్‌ కేంద్రంలో మంగళవారం ఈ ప్రయోగం నిర్వహించింది.

మూడు-దశల ఆల్-సాలిడ్ లాంచ్ వెహికల్ ఎస్‌ఎస్‌ఎల్వీ పనితీరును విశ్లేషించడంతోపాటు డేటాను సేకరించినట్లు ఇస్రో వెల్లడించింది. అంతరిక్షంలోకి చిన్న ఉపగ్రహాలను వేగంగా ప్రయోగించడం కోసం దీనిని రూపొందించారు. అధిక స్థాయిలో ఉత్పత్తికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. పేలోడ్‌కు సెకనుకు 4 కి.మీ వేగాన్ని అందించడంలో ఎస్‌ఎస్‌-3 కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు వెల్లడించారు. పేలోడ్ సామర్థ్యాన్ని సుమారు 90 కిలోల వరకు మెరుగుపరుస్తుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande