చైనా ఉత్పత్తులే టార్గెట్‌.. స్టీల్‌ దిగుమతులపై భారత్‌ టారిఫ్‌లు..
ఢిల్లీ.31, డిసెంబర్ (హి.స.) చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌకైన ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి దిగుమతయ్యే కొన్ని రకాల స్టీల్‌ ఉత్పత్తులపై 12 శాతం టారిఫ్‌లు విధించింది (India Imposes Tariffs on Steel)
చైనా ఉత్పత్తులే టార్గెట్‌.. స్టీల్‌ దిగుమతులపై భారత్‌ టారిఫ్‌లు..


ఢిల్లీ.31, డిసెంబర్ (హి.స.)

చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌకైన ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి దిగుమతయ్యే కొన్ని రకాల స్టీల్‌ ఉత్పత్తులపై 12 శాతం టారిఫ్‌లు విధించింది (India Imposes Tariffs on Steel). ఇది మూడేళ్ల పాటు అమలులో ఉండనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ప్రకటన ప్రకారం.. తొలి సంవత్సరంలో ఈ సుంకం 12 శాతంగా ఉండనుంది. రెండో ఏడాదికి గాను అది 11.5 శాతానికి తగ్గగా.. మూడో ఏడాదిలో 11 శాతంగా ఉండనుంది. ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తుల్లో భారత్‌ (India) రెండో స్థానంలో ఉంది. చైనా (China) నుంచి తక్కువ ధరలకే ఉక్కు వస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల దేశీయ ఉక్కు తయారీదారులపై కూడా ప్రభావం పడుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల దిగుమతులకు దీనినుంచి ఉపశమనం కల్పించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande