బాబ్రీ మసీదు ప్రతిపాదన తెచ్చిన ఎమ్మెల్యేపై మమత ఆగ్రహం
కోల్‌కతా,04, డిసెంబర్ (హి.స.) తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించాలనే ప్రాతిపాదనను తీసుకొచ్చారు. అయితే ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక
మమత ఆగ్రహం


కోల్‌కతా,04, డిసెంబర్ (హి.స.) తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించాలనే ప్రాతిపాదనను తీసుకొచ్చారు. అయితే ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి మసీదు నిర్మాణంలో పాల్గొనబోరని.. సందేశాన్ని ఎమ్మెల్యేకు తెలియజేసినట్లు వర్గాలు తెలిపాయి.

బుధవారం బెంగాల్ మంత్రి బ్రాత్య బసు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ సమస్యను పార్టీ నాయకత్వం చూసుకుంటోంది. ఎమ్మెల్యే నిరంతరం తన అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. రేపు బహరంపూర్‌లో జరిగే ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఆయన హాజరవుతారని మేము ఆశిస్తున్నాము.’’ అని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ (SIR)కు నిరసనగా మమతా బెనర్జీ గురువారం భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా ముర్షిదాబాద్‌లో ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే భరత్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హుమాయున్ కబీర్‌ను కూడా పార్టీ ఆహ్వానించిందని, ఆయన ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande