
ఢిల్లీ ,04 డిసెంబర్ (హి.స.) నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. పట్టుదల, ధీరత్వానికి భారత నేవి పర్యాయపదమని ప్రశంసించారు. ‘నేవీ డే సందర్భంగా భారత నావికాదళ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు. అసమాన ధైర్యసాహనాలు, పట్టుదలకు మన నేవీ పర్యాయపదం. దేశ ప్రయోజనాలకు, తీర ప్రాంతానికి నేవీ రక్షణగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో స్వావలంబన, అధునికీకరణపై నేవీ దృష్టి సారించింది’ అని మోదీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. నేవీ తీసుకుంటున్న చర్యల కారణంగా దేశ భద్రత మరింత పటిష్ఠమైందని అన్నారు (PM Navy Day Greetings).
ఈ సందర్భంగా దీపావళిని తాను ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకపై జరుపుకున్న విషయాన్ని కూడా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ