
హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.)
మిజోరం మాజీ గవర్నర్, భాజపా దివంగత నేత సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ (73) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమార్తె బన్సూరీ స్వరాజ్ వెల్లడించారు.
1952 జులై 12న హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో జన్మించిన స్వరాజ్ కౌశల్.. 37 ఏళ్ల వయసులోనే (1990లో) మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన భార్య సుష్మా స్వరాజ్.. దిల్లీ ముఖ్యమంత్రిగా, భారత విదేశాంగమంత్రిగా సేవలందించారు. 2019 ఆగస్టు 6న ఆమె మరణించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు