కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్.. నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, 8 డిసెంబర్ (హి.స.) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు బిగ్ షాక్ తగిలింది. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023లో ఆయన ఎన్నికను సవాలు చేస్తూ కె. శంకర్ అనే వ్
కర్ణాటక సీఎం


న్యూఢిల్లీ, 8 డిసెంబర్ (హి.స.)

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

కు బిగ్ షాక్ తగిలింది. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023లో ఆయన ఎన్నికను సవాలు చేస్తూ కె. శంకర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిద్ధరామయ్య ఎన్నిక చెల్లదని, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఆయన తీవ్ర అవినీతికి పాల్పడ్డారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు శంకర్ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం, వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande