
బెస్తవారిపేట, 8 డిసెంబర్ (హి.స.)
: ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద ఘోర ప్రమాదంచోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొని డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఆయిల్ ట్యాంకర్, అరటి పండ్ల లోడ్ లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు