మంతెనకు యోగా, నేచరోపతి విభాగ సలహాదారుగా బాధ్యతలు
హైదరాబాద్, 09 మార్చి (హి.స.)ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజును నియమిస్తూ ప్రభుత్వం ఈరోజు(సోమవారం) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మంతెనకు యోగా & నేచరోపతి విభాగానికి సలహాదారుగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ హోద
మంతెనకు యోగా, నేచరోపతి విభాగ సలహాదారుగా బాధ్యతలు


హైదరాబాద్, 09 మార్చి (హి.స.)ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజును నియమిస్తూ ప్రభుత్వం ఈరోజు(సోమవారం) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మంతెనకు యోగా & నేచరోపతి విభాగానికి సలహాదారుగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ హోదాతో పాటు హానరరీ అడ్వైజర్‌గా బాధ్యతలు అప్పగించింది. రెండు సంవత్సరాల పదవీకాలం వరకు ఆయన సేవలు కొనసాగనున్నాయి. వాహనం, కార్యాలయం, సిబ్బంది సౌకర్యాలతో పాటు అధికారిక పర్యటనలకు ట్రావెల్ అలవెన్స్ కూడా కల్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ జి. సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande