మాట నిలబెట్టుకున్న సునీల్ గావస్కర్..
టీ20 ప్రపంచ కప్2026 ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆనందంతో చిందేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Sports


హైదరాబాద్, 09 మార్చి (హి.స.)భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను గెలిచిన విషయం తెలిసిందే. తుదిపోరులో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సూర్య కుమార్ సేన.. టైటిల్ను ముద్దాడింది. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్..తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఇంతకు ఆయన ఇచ్చిన మాట ఏంటి?. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీ ప్రారంభానికి ముందు సూర్యకుమార్ యాదవ్కు గావస్కర్ ఓ వాగ్దానం చేశారు. 2024లో గెలిచిన టైటిల్ను భారత జట్టు కాపాడుకుంటే.. తాను డ్యాన్స్ చేస్తానని సూర్యకు గావస్కర్ మాట ఇచ్చారు. ఈ క్రమంలో నిన్న(ఆదివారం) గవాస్కర్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తుదిపోరులో టీమిండియా గెలిచిన అనంతరం ఈ లెజెండరీ ప్లేయర్ ఆనందంతో చిందులేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలానే మ్యాచ్కు ముందు జరిగిన ముగింపు వేడుకలోనూ ఓ బాలీవుడ్ సాంగ్కు సునీల్ గావస్కర్ స్టెప్పులేశాడు. ఇలా అయన మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande