గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం.. మంత్రి పొన్నం ప్రభాకర్
హుజురాబాద్, 09 మార్చి (హి.స.) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సైదాపూర్ మండలం రోల్ మోడల్ గా నిలవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు నిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతో పాట
మంత్రి పొన్నం


హుజురాబాద్, 09 మార్చి (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సైదాపూర్ మండలం రోల్ మోడల్ గా నిలవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు నిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు మండల సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని విశాల పరపతి సహకార సంఘం ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణలో భాగంగా పది ముఖ్య అంశాలపై దృష్టి సారించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు.

గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీలకు ఆదేశించారు. మహిళా సంఘాల సమన్వయంతో వ్యర్థాల సేకరణ చేపట్టి, ఉపయోగం లేకుండా పడిపోయిన టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను రీసైక్లింగ్కు పంపించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. మండలానికి ఒక మెడికల్ కాలేజీని దత్తతగా ఇచ్చినట్లు పేర్కొంటూ అవసరమైతే హైదరాబాద్లో చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో

రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని, ఇంకా అవసరమైన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

రైతుల సమస్యలను గ్రామాల వారీగా సమీక్షించి పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడానికి చర్యలు తీసుకోవడంతో పాటు స్కూల్ డ్రాప్ అవుట్ లేకుండా చూడాలని అన్నారు. యువత క్రీడల్లో ప్రతిభ చాటేందుకు ప్రోత్సహించాలని సూచించారు. మహిళా సంఘాలకు ఇచ్చిన స్టీల్ బ్యాంక్లను సక్రమంగా వినియోగిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. వర్షాకాలంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై ఇంకా పూర్తికాని ఇళ్లను వేగంగా పూర్తి చేసి 99 రోజుల్లో కనీసం 70 శాతం ఇళ్లలో గృహప్రవేశం జరగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాత ఈజీఎస్ బిల్లులను త్వరితగతిన క్లియర్ చేసేందుకు సర్పంచ్లు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande