రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక: రిటర్నింగ్ అధికారి
హైదరాబాద్, 09 మార్చి (హి.స.) తెలంగాణ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. . కాంగ్రెస్ పార్టీ తరఫున వేం నరేంద్ర రెడ్డి,
Abhishek and Reddy


హైదరాబాద్, 09 మార్చి (హి.స.)

తెలంగాణ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ప్రకటించారు.

. కాంగ్రెస్ పార్టీ తరఫున వేం నరేంద్ర రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఆయన వివరించారు. అందుకు సంబంధించిన పత్రాలను కాసేపట్లో వీరికి అందజేయనున్నట్లు తెలిపారు.

రాజ్యసభలో పలువురి సభ్యుల పదవి కాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసింది. గురువారంతో నామినేషన్ల ప్రకియ ముగిసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తరఫున తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన రాజ్యసభ ఎన్నికల కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి వీరు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande