దేశ ఆర్థిక రంగానికి హైదరాబాద్ పిల్లర్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) రంగారెడ్డి జిల్లా కందుకూరు లోని ఫీచర్స్ సిటీ నందు నేడు ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడే ప్రధానిగా మోడీ బాధ్యతలు
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) రంగారెడ్డి జిల్లా కందుకూరు లోని ఫీచర్స్ సిటీ నందు నేడు ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడే ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టారు. పదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. హైదరాబాద్ కేవలం రాష్ట్ర రాజధానే కాదు. దేశంలో కీలకమైన ఆర్థిక నగరం. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేశ ఆర్థిక రంగానికి హైదరాబాద్ పిల్లర్ అని అన్నారు. ఫార్మా హబ్డి, ఏరోస్పేస్ సెంటర్గా హైదరాబాద్ అవతరించిందని చెప్పారు. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచాల్సిన అవసరం ఉంది. వికసిత్ భారత్ సాధనలో రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండాలి. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం.. సురక్షితమైన దేశం అని కిషన్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో రాష్ట్రం అనేక రంగాల్లో ప్రగతి సాధించింది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కూడా అద్భుతంగా సహకరిస్తోందని చెప్పారు. వికసిత్ భారత్ 2047లో తెలంగాణది అత్యంత కీలకమైన పాత్ర అని గుర్తుచేశారు. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande