విజయవాడ, 5 ఫిబ్రవరి (హి.స.)
: ఏపీఎస్ ఆర్టీసీ బోర్డును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ చైర్మన్‌గా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, వైస్ చైర్మన్‌గా పీ.యస్. మునిరత్నంలతోపాటు డైరెక్టర్లుగా రెడ్డి అప్పలనాయుడు, సురేష్ రెడ్డి, పూలా నాగరాజులను నియమించారు. అలాగే రవాణా, ఆర్ధిక, జీఏడీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఎపీయస్ ఆర్డీసీ ఎండీ, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, ఫైనాన్షియల్ అడ్వయిజర్, కేంద్ర ప్రభుత్వ రోడ్ సేఫ్టీ డైరెక్టర్, ట్రాన్స్‌పోర్టు డైరెక్టర్లతోపాటు కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ది శాఖ డైరెక్టర్లను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల