విజయవాడ, 5 ఫిబ్రవరి (హి.స.)
సచివాలయ ఉద్యోగులు ఏ సమయానికి వస్తారో.. వెళతారో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో నిర్వహిస్తున్న హౌస్‌హోల్డ్ సర్వేలు, రీసర్వేలు ఇతరత్రా పనులుంటే సచివాలయంలోని రిజిస్టర్‌లో నమోదు చేసి బయటకు వెళ్లాలి. కానీ, సర్వేపేరుతో కొందరు ఉద్యోగులు నిత్యం బయటే ఉంటున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సచివాలయాల్లోనూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారనే భయం లేకుండా విధులకు డుమ్మా కొడుతున్నారు. పుట్టపర్తి, ముదిగుబ్బ, తనకల్లు మండలాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఉదయం 10:30 గంటలకు రావాల్సినవారు 11 గంటలకు, కొందరైతే ఏకంగా 12 గంటలకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకే బయటకెళ్లిపోయి ఎప్పుడు వస్తారో తెలియని
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల