విజయవాడ, 5 ఫిబ్రవరి (హి.స.)
పవన్ కల్యాణ్ కు అస్వస్థత ఏర్పడింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని ఆయన టీం తెలిపింది. పవన్ కళ్యాణ్ ను జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధ పెడుతోందని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారని అన్నారు.
ఈ కారణంగా గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ గారు హాజరు కాలేక పోవచ్చని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వలన సినిమా షూట్స్ కి దూరంగా ఉంటున్నారు. నిజానికి ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ ఈరోజు నుంచి మొదలైందని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అనారోగ్యం దృష్ట్యా ఆయన అందులో కూడా పాల్గొనలేక పోవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల