ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన..
తెలంగాణ, కామారెడ్డి. 5 ఫిబ్రవరి (హి.స.) రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సోమవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని సినిమా టాకీస్ చౌరస్తాలో విద్యార
ఏబీవీపీ


తెలంగాణ, కామారెడ్డి. 5 ఫిబ్రవరి (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సోమవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని సినిమా టాకీస్ చౌరస్తాలో విద్యార్థిని విద్యార్థులు బైఠాయించి, ఆందోళనకు దిగడంతో రోడ్డుకిరువైపులా వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా టీజీవీపీ అధ్యక్షుడు గంధం సంజయ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రూ.7,78 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ ను, ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని, ఫీజు నియంత్రణ చట్టాలను అమలు చేయాల్సిందేనన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆందోళనకు దిగిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande