తెలంగాణ, 5 ఫిబ్రవరి (హి.స.) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మండలంలోని ప్యారానగర్ సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన చేస్తున్న 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్యారానగర్ 100 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కాగా, స్థానికుల వ్యతిరేకతతో జీహెచ్ఎంసీ అధికారులు అర్ధరాత్రి వేళ రహస్యంగా డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్