గత ప్రభుత్వ బకాయిలపైన చర్చకు సిద్ధం.. మంత్రి నారా లోకేష్
ఏ.పీ, వెలగపూడి.12 మార్చి (హి.స.) ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టి.. ఇప్పుడు వైసీపీ సభ్యులే ధర్నాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో బుధవారం ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల అంశం
మంత్రి లోకేష్


ఏ.పీ, వెలగపూడి.12 మార్చి (హి.స.)

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు

పెట్టి.. ఇప్పుడు వైసీపీ సభ్యులే ధర్నాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో బుధవారం ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల అంశంపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. మండలి ఛైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమన్నారు. గత ప్రభుత్వ బకాయిలపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి.. ఇప్పుడు ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande