హైదరాబాద్, 12 మార్చి (హి.స.)
కాకినాడ పోర్టు అక్రమాల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలోని తాడిగడప సీఐడీ
కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
కాకినాడు పోర్టు, కాకినాడ సెజ్కు సంబంధించిన వాటాల బదలాయింపులో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. కాకినాడ పోర్టు సెజ్జమానిగా
ఉన్న కేవీరావు ఫిర్యాదు మేరకు కేసు
నమోదైంది. ఈ కేసులో విక్రాంత్రెడ్డి మొదటి నిందితుడిగా ఉన్నారు. విజయసారి రెండో నిందితుడు.
ఈ కేసులో ఈడీ ఇప్పటికే విజయసాయిని విచారించింది. సీఐడీ అధికారుల నోటీసు మేరకు ఆయన విచారణకు వచ్చారు. ఆయనతో పాటు న్యాయవాదులు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వాటాల బదలాయింపులో రూ.4 కోట్ల
నష్టం జరిగిందని కేవీరావు ఫిర్యాదులో పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..