ఏ.పీ,ఎన్టీఆర్ జిల్లా, 12 మార్చి (హి.స.)
వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి వర్రా రవీందర్ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు బుధవారం 14 రోజుల రిమాండ్ విధించింది. మెడ నొప్పి, నడుముల నెప్పి వల్లన కడప సెంట్రల్ జైలుకు పంపించాలని వర్రా కోరారు. అయితే జగ్గయ్యపేట సబ్ జైల్లో అవసరమైన ఏర్పాట్లు, చికిత్స అందించాలని పోలీసులకు మెజిస్ట్రేట్ తెలిపింది. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రాని.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు పీటీ వారెంట్పై మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో వర్రాపై పలు కేసులు నమోదయ్యాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..