టీటీడీ అధికారుల తీరు పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీరియస్
తిరుమల, 14 మార్చి (హి.స.) టీటీడీ అధికారుల తీరు పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీరియస్ అయ్యారు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతిని ధులు ఇచ్చిన లేఖలను పరిగణలోకి తీసుకోక పోవటం పైన ఆయన మండిపడ్డారు. తెలంగాణ నేతల లేఖ లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ సీఎం సూచించినా..
ఎంపీ రఘునందన్ రావు


తిరుమల, 14 మార్చి (హి.స.) టీటీడీ అధికారుల తీరు పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీరియస్ అయ్యారు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతిని ధులు ఇచ్చిన లేఖలను పరిగణలోకి తీసుకోక పోవటం పైన ఆయన మండిపడ్డారు. తెలంగాణ నేతల లేఖ లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ సీఎం సూచించినా.. టీటీడీ బోర్డు కూడా నిర్ణయించినా ఎందుకు పరిగణ లోకి తీసుకోవటం లేదని ప్రశ్నించారు. తిరుమలలో నేడు ఆయన శ్రీవారిని దర్శంచుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సిఫార్స్ లేఖలపై త్వరగా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసారు. వేసవి సెలవులలో తమ భక్తులకు ఇచ్చే లేఖలపై దర్శనం కలిగించాలన్నారు.. ఏప్రిల్ లోగా పరిస్థితిలో మార్పు రాకుంటే తెలంగాణ ప్రతినిధులందరితో టిటిడి కార్యాలయానికి వచ్చి అక్కడే తేల్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు..

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande