న్యూఢిల్లీ, 14 మార్చి (హి.స.) ఈనెల 24, 25 తేదీల్లో రెండు రోజులపాటు
దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితాలను ఇవ్వకపోవడంతో సమ్మెపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అన్ని కేడర్లలో నియామకాలు, వారంలో ఐదురోజుల పని తదితర డిమాండ్లపై చర్చించేందుకు యూఎఫ్బయూ సభ్యులు ఐబీఏను కలిశారు. ఆయా డిమాండ్లపై ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE) ప్రధాన కార్యదర్శి ఎల్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. తొమ్మిది బ్యాంక్ ఉద్యోగ సంఘాలతో కూడిన యూఎఫ్బయూ ఇప్పటికే డిమాండ్లపై సమ్మె ప్రకటించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..