గుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
గుజరాత్, 14 మార్చి (హి.స.) శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజ్కోట్ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో ఉన్నట్టుండి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలు కాస్త అపార్ట్మెంట్ మొత్తం వ్యాప్తించా
ఫైర్ యాక్సిడెంట్


గుజరాత్, 14 మార్చి (హి.స.) శుక్రవారం ఉదయం

భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజ్కోట్ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో ఉన్నట్టుండి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలు కాస్త అపార్ట్మెంట్ మొత్తం వ్యాప్తించారు. దీంతో ఆయా ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు కాలి బూడిదై ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అదేవిధంగా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఫైర్ సిబ్బంది మరో 50 మందిని సురక్షితంగా అపార్ట్మెంట్ నుంచి బయటకు తీసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande