హైదరాబాద్, 14 మార్చి (హి.స.)గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. హోలీ రోజున బంగారు ఆభరణాలు గిఫ్ట్‌గా ఇవ్వాలంటే మాత్రం ధరల విషయంగా కొంత ఆలోచించాలని సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,300 (22 క్యారెట్స్), రూ.89,780 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1,100, రూ.1,200 పెరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు