జన్మతః పౌరసత్వం రద్దుపై సుప్రీం కోర్టుకు ట్రంప్‌
న్యూఢిల్లీ /, వాషింగ్టన్‌ 14 మార్చి (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జన్మతః పౌరసత్వం రద్దు ఉత్తర్వులను ఫెడరల్‌ కోర్టులు నిలిపివేయడాన్ని ఆయన సవాల్‌ చేశారు. త్వరలోనే ఈ పిటిషన్‌ విచారణకు రానుంది.

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే(జనవరి 20వ తేదీన) విదేశీయులకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కు (Birthright citizenship)ను ట్రంప్‌ రద్దు చేశారు. ఫిబ్రవరి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. పలువురు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు

 rajesh pande