నెల్లూరు 14 మార్చి (హి.స.)
:జీఆర్‌పీ సీఐ భుజంగరావు )ని వీఆర్ (కు పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అతనిపై త్వరలో శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఐ భుజంగరావు అక్రమాలపై గతంలో ఆధారాలతో ఉన్నతాధికారులు.. విచారణ చేపట్టారు. సీఐ భుజంగరావుపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా, పడుగుపాడులో హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించిన సీఐ భుజంగరావు... సిబ్బందిని తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేసి.. పెద్ద మొత్తాల్లో డబ్బులు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల