నాగర్ కర్నూల్, 14 మార్చి (హి.స.)
ఎస్ఎల్బిసిలో జరిగిన ప్రమాదంలో
సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
శుక్రవారం సహాయక చర్యల పురోగతి పై టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యల పై డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు.
టన్నెల్ లోపల సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్ ను సమర్థవంతమైన సహాయక చర్యల కోసం పంపినట్లు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..