విశాఖపట్నం ఇందిరా గాంధీ జూ లో చిరుత పులి మృతి.
ఏ.పీ, విశాఖపట్నం, 14 మార్చి (హి.స.) విశాఖపట్నం ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో ఒక చిరుత పులి మృతి చెందింది. సుధా అనే పేరుతో పిలిచే ఈ ఆడ చిరుత వయోభారంతో మరణించిందని అధికారులు తెలిపారు. ఈ చిరుత వయసు 20 సంవత్సరాలని, గురువారం రాత్రి 7:30 గంటల సమయంలో మ
చిరుత పులి మృతి.


ఏ.పీ, విశాఖపట్నం, 14 మార్చి (హి.స.)

విశాఖపట్నం ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో ఒక చిరుత పులి మృతి చెందింది. సుధా అనే పేరుతో పిలిచే ఈ ఆడ చిరుత వయోభారంతో మరణించిందని అధికారులు తెలిపారు. ఈ చిరుత వయసు 20 సంవత్సరాలని, గురువారం రాత్రి 7:30 గంటల సమయంలో మృతి చెందిందని తెలిపారు. అడవుల్లో చిరుతలు సహజంగా 10 నుంచి 12 సంవత్సరాలు జీవిస్తాయని అయితే 'జూ'లో రక్షణలో ఉండటం వల్ల ఈ చిరుత 20 సంవత్సరాల పాటు బతికిందని తెలిపారు. నిబంధనల మేరకు అధికారుల సమక్షంలో ఖననం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande