కరీంనగర్, 14 మార్చి (హి.స.) పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఇక, యువకులు బండి సంజయ్ కి రంగులు పూసి సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఇక, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. హిందు బంధువులకి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఆహ్లదకరమైన వాతావరణంలో జరుపుకునే పండుగ హోలీ.. హిందు సమాజం అంతా కలిసికట్టుగా ఉండాలి అని పిలుపునిచ్చారు. కులాలకి అతీతంగా హిందువులంతా కలిసిమెలిసి ఉండాలి.. యువత జాగ్రత్తగా ఉండాలి.. తెలంగాణ రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం, అహంకార ధోరణి, అబద్దాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో బీజేపీ కార్యకర్తలు కలిసికట్టుగా ఉండాలి అని బండి సంజయ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల