దిల్లీ: , 14 మార్చి (హి.స.)ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్‌లపై అవినీతి కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రూ.2,000 కోట్ల విలువైన తరగతి గదుల నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుందని 2022లో దిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ ఇచ్చిన నివేదికతో ఈ ఎఫ్‌ఐఆర్ నమోదుకు అధికారులు అనుమతి కోరారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద రాష్ట్రపతి అనుమతి మంజూరు చేశారు.
దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని 2020 ఫిబ్రవరి 17వ తేదీన కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నివేదిక ఇచ్చింది. ఈ పనులను ప్రజా పనుల విభాగం చేపట్టింది. ఆ సమయంలో కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రులుగా సిసోదియా, జైన్ ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు