అగ్ర హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్ లకు చుట్టుకున్న బెట్టింగ్ యాప్స్ కేసు..
హైదరాబాద్, 23 మార్చి (హి.స.) బెట్టింగ్ యాప్స్ విషయంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు కాగా.. ఇప్పుడు అగ్ర హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్ లను చుట్టుకుంది. రామారావు అనే వ్యక్తి ఈ ముగ్గురిపై సిటీ పోలీసులకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చే
బెట్టింగ్ యాప్స్


హైదరాబాద్, 23 మార్చి (హి.స.)

బెట్టింగ్ యాప్స్ విషయంలో

ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు కాగా.. ఇప్పుడు అగ్ర హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్ లను చుట్టుకుంది. రామారావు అనే వ్యక్తి ఈ ముగ్గురిపై సిటీ పోలీసులకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, కాజల్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, విష్ణుప్రియతో పాటు చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలపై కూడా కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇందుకు అన్ స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడమే కారణం అని తెలుస్తోంది.

బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి ప్రభాస్, గోపీచంద్ ఓ ఎపిసోడ్ కోసం గెస్టులుగా వచ్చారు. ప్రోగ్రామ్ మధ్యలో ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారని.. అది నిజమే అనుకుని తాను డౌన్ లోడ్ చేసుకున్నట్టు రామారావు ఆన్ లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యాప్ లో బెట్టింగ్ ఆడి రూ.83 లక్షలు పోగొట్టుకున్నానని రామారావు ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande