తిరుపతి, 29 మార్చి (హి.స.)
తొట్టంబేడు మండలం పెద్దకన్నలి బ్రిడ్జి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొన్న ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
హైదరాబాద్ కు చెందిన మల్లారెడ్డి, భరత్ కుమార్, బాలిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తిరుమల దర్శనానికి వెళుతుండగా మార్గమధ్య మలో డ్రైవర్ శ్రీనివాసులు రెడ్డి నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి