బెంగళూరు, 28 మార్చి (హి.స.)బెంగళూరులో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, అవశేషాలను సూట్‌కేస్‌లో నింపిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా రాజస్థాన్, బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండటం దేశవ్యాప్తంగా భయాందోళనలు రేపుతున్నాయి. అయితే, ఈ తరహా దారుణం తాజాగా రాజధాని బెంగళూరులో జరగటం ప్రజల్లో మరింత ఆందోళన రేపుతోంది.
కర్ణాటకలో ఓ వ్యక్తి తన భార్యను చంపి ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కేశాడు. ఆ తర్వాత భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రకు చెందిన రాకేశ్, గౌరీ సంబేకర్ (32)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత వారిద్దరూ బెంగళూరులోని దొడ్డ కమ్మనహళ్లిలో కొత్త ఇల్లును కొనుక్కొని అక్కడే నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఒకే ప్రైవేట్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాకేశ్ తన భార్య గౌరీ సంబేకర్ను హత్య చేసి ఆమె డెడ్ బాడీని ముక్కలుగా చేసి సూట్ కేసులో కుక్కాడు. ఆపై ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేయడం వల్ల అసలు విషయం బయటపడింది. దీంతో గౌరీ తల్లిదండ్రులు వెంటనే మహారాష్ట్రలోని పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. వారి సమాచారం మేరకు బెంగళూరులోని హులిమావు పోలీసులు రాకేశ్ ఇంటికి వెళ్లి తనిఖీలు చేసి బాత్రూమ్లో పెట్టిన సూట్ కేస్‌లో గౌరీ మృతదేహాన్ని గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి