దేశ ఆర్థిక వ్యవస్థలో ఏప్రిల్ ఒకటి నుండి కీలక మార్పులు..
న్యూఢిల్లీ, 29 మార్చి (హి.స.) ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. UPI, GST, పన్ను రేట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పౌరుల్ని ప్రభావితం చేస్తే ఆర్థిక మార్పులు అమలులోకి రానున్నాయి. పన్ను స్లాబుల మార్పుల నుంచి యూనిఫై
ఏప్రిల్ ఒకటి నుండి


న్యూఢిల్లీ, 29 మార్చి (హి.స.)

ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. UPI, GST, పన్ను రేట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పౌరుల్ని ప్రభావితం చేస్తే ఆర్థిక మార్పులు అమలులోకి రానున్నాయి. పన్ను స్లాబుల మార్పుల నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూనిఫైడ్ పెన్షన్ పథకం ప్రారంభం వరకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వార్షిక బడ్జెట్లో కొత్త పన్ను స్లాబులు, రేట్లను ప్రకటించిన తర్వాత, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోతున్నాయి. వార్షికంగా 12 లక్షల వరకు సంపాదించే వారు కొత్త విధానంలో పన్నుల నుంచి మినహాయించబడతారు. అదనంగా జీతం పొందే వ్యక్తులు రూ. 75,000 స్టాండర్డ్ మినహాయింపులకు అర్హులు అవుతారు. దీని అర్థం రూ.12,75,000 వరకు జీతం ఉన్న వ్యక్తి ఎలాంటి పన్నులు చెల్లించకుండా మినహాయించబడుతాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande