భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే..
ముంబై, 29 మార్చి (హి.స.) బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్‌గా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో 91వేల మార్క్ దాటగా వెండి లక్షా 15 వే
GOLD


ముంబై, 29 మార్చి (హి.స.)

బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్‌గా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో 91వేల మార్క్ దాటగా వెండి లక్షా 15 వేల మార్కుకు చేరువైంది. అయితే.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయన్న విషయం తెలిసిందే.. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి.. అయితే.. తాజాగా.. బంగారం, వెండి ధరలు పెరిగాయి.

ఈ రోజు 29 మార్చి 2025 శనివారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.83,410, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.90,990 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,05,100 లుగా ఉంది. దేశియంగా పది గ్రాముల బంగారంపై రూ.1100 మేర, వెండి కిలోపై దాదాపు రూ.3వేల మేర ధర పెరిగింది. అయితే.. ప్రాంతాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.83,410, 24 క్యారెట్ల ధర రూ.90,990 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.83,410, 24 క్యారెట్ల ధర రూ.90,990గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.83,560, 24 క్యారెట్ల ధర రూ.91,140 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.83,410, 24 క్యారెట్ల ధర రూ.90,990 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.83,410, 24 క్యారెట్ల రేటు రూ.90,990 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.83,410, 24 క్యారెట్ల ధర రూ.90,990 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,14,100

విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,14,100

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.1,05,100 లుగా ఉంది.

ముంబైలో రూ.1,05,100 గా ఉంది.

బెంగళూరులో రూ.105,100

చెన్నైలో రూ.1,14,100 లుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande