తెలంగాణ, మంచిర్యాల. 29 మార్చి (హి.స.)
ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో క్షేత్రస్థాయిలో అవినీతి, అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులదేనని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శుల సమీక్ష సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇల్లు అర్హులకు మాత్రమే ఇవ్వాలని, అనర్హులకు ఇస్తే సంబంధిత కార్యదర్శులపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి వాడల్లో సీసీరోడ్లు నిర్మిస్తామని, ఇండ్లులేని చోట సీసీరోడ్లు వేస్తే కార్యదర్శులపై చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు