విజయవాడ, 31 మార్చి (హి.స.)
అర్థవీడు, : పసిడి అలంకరణ ఆభరణంగానే కాకండా పెట్టుబడి సాధనంగానూ మారింది. దీంతో చాలా మంది ఇప్పుడు పుత్తడి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అసలు ఓ వ్యక్తి వద్ద చట్టప్రకారం ఎంత బంగారం ఉండొచ్చనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వ్యక్తుల వద్ద ఉండే బంగారంపై పరిమితులు ఉన్నాయి. సదరు అధికారులు అనుమానంతో సోదాలు చేసినప్పుడు పరిమితికి మించి ఉంటే ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులైతే ఆదాయ పన్ను రిటర్న్‌లో వివరాలనూ ఇప్పుడు తప్పక నమోదు చేయాల్సి వస్తోంది.
చట్టం ప్రకారం మహిళలు, పురుషులు బంగారాన్ని సమానంగా కలిగి ఉండే అవకాశం లేదు. పెళ్లయిన మహిళల వద్ద 500 గ్రాములు(50 తులాలు), అవివాహిత మహిళల వద్ద 250 గ్రాముల(25 తులాలు) వరకు ఉండొచ్చు. అదే పురుషులైతే వివాహమైనా.. కాకున్నా 100 గ్రాముల(10 తులాలు) వరకే కలిగి ఉండాలి. అంతకుమించితే సరైన పత్రాలు చూపాలి. లేకుంటే జప్తు చేసే అధికారం ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల