యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్నదే రాజీవ్ యువ వికాసం పథక లక్ష్యం.. మంత్రి దుద్దిల్ల
జయశంకర్ భూపాలపల్లి, 31 మార్చి (హి.స.) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్
మంత్రి దుద్దిల్ల


జయశంకర్ భూపాలపల్లి, 31 మార్చి (హి.స.)

జయశంకర్ భూపాలపల్లి

జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ,మైనార్టీల,వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కొరకు రాజీవ్ యువ వికాసం కార్యక్రమని, రాష్ట్రంలో ఉన్న యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం ద్వారా రూ.50 వేల నుండి రూ.4 లక్షల వరకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల తర్వాత యువతకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామని, ఈ కార్యక్రమంలో అన్నికులాల వారికి అవకాశమని ఆయన మంత్రి శ్రీధరా బాబు అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande