హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలు పెంపు
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలు మరోసారి పెరిగాయి. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచీసీ
టోల్ చార్జీలు


హైదరాబాద్, 31 మార్చి (హి.స.) హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలు మరోసారి పెరిగాయి. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచీసీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను ఐఆర్బో సంస్థ రెండేండ్ల క్రితం 30 ఏండ్ల కాలానికి లీజు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వరకు టోల్ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్ ధరలను పెంచింది.

దీని ప్రకారం కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలకు కిలోమీటర్కు 10 పైసలు, మినీబస్, ఎల్సీవీలకు కిలోమీటర్కు 20 పైసలు, యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచింది. భారీ వాహనాలకు కిలోమీటర్కు రూ.15.09 నుంచి రూ.15.78కు పెంచింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande