హైదరాబాద్, 31 మార్చి (హి.స.)
బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఏకమయ్యాయని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని గెలిపించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమై ఆ పార్టీకి సహాయం చేస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు ఉన్నా సరే వారికి ఎంఐఎంతో ఉన్న అనుబంధం కారణంగా పోటీ చేయడం లేదన్నారు. ఎంతమంది ఏకమైనా బీజేపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సన్నబియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కాని అందులో కేంద్రానికి కూడా వాటా ఉందని, ప్రతి కిలోకు రూ.40 చొప్పున కేంద్రం భరిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్