కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి తన లక్ష్యం..ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
తెలంగాణ, జగిత్యాల. 29 మార్చి (హి.స.) కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు నిరంతరమైన వైద్య సేవలు కార్పోరేట్ స్థాయిలో అందించేందుకు
కోరుట్ల ఎమ్మెల్యే


తెలంగాణ, జగిత్యాల. 29 మార్చి (హి.స.) కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు నిరంతరమైన వైద్య సేవలు కార్పోరేట్ స్థాయిలో అందించేందుకు అవసరమైన వసతుల కల్పనకు శాయశక్తుల కృషి చేస్తానని పురనరుద్ఘాటించారు.

కోరుట్ల పట్టణంలోని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శనివారం ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా సమావేశంలో ఆసుపత్రి పరిధిలో చెపట్టాల్సిన పనులు, ఖర్చు చేయాల్సిన నిధులు, ఇతరాత్ర అంశాలపై చర్చించారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలు ఆమోదించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande