Lసంగమేశ్వర ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు
తెలంగాణ, సంగారెడ్డి. 29 మార్చి (హి.స.) దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శని అమావాస్యను పురస్కరించుకొని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి
మంత్రి దామోదర


తెలంగాణ, సంగారెడ్డి. 29 మార్చి (హి.స.) దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శని అమావాస్యను పురస్కరించుకొని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అర్చకులు వేదామంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

పార్వతి సమేత సంగమేశ్వర స్వామి వారికి అభిషేకం, మంగళహారతి వంటి కార్యక్రమాలను చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమంలో శనైశ్వరునికి తైలాభిషేకంతోపాటు నవగ్రహాలకు, పంచావృక్షాలకు, జ్యోతిర్లింగాలకు పూజలు నిర్వహించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande