మహాత్మా గాంధీ యూనివర్సిటీని అభివృద్ధి చేసేందుకు చేయూత.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
తెలంగాణ, నల్గొండ. 29 మార్చి (హి.స.) నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చేయూతనివ్వనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం మహాత్మాగాంధీ యూనివర్సిటీని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.


తెలంగాణ, నల్గొండ. 29 మార్చి (హి.స.)

నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చేయూతనివ్వనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం మహాత్మాగాంధీ యూనివర్సిటీని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ చాంబర్లో వివిధ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

యూనివర్సిటీలో నూతనంగా ప్రవేశపెట్టే కోర్సులు, వాటి వివరాలు, వాటికి కావాల్సిన నిధులు, సిబ్బంది ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande