తెలంగాణ, పెద్దపల్లి. 29 మార్చి (హి.స.)
ఉగాది పండుగ వేళ తెల్ల రేషన్
కార్డుదారులందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ లో శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 130వ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రుణమాఫీ వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి వడ్ల కటింగులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి పారదర్శక పాలన అందించడం జరుగుతుందని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు