తెలుగు దేశం.పార్టీ.43 వ.ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్గంగా నిర్వహించేందుకు.ఏర్పాట్లు
విజయవాడ, 29 మార్చి (హి.స.)తెలుగుదేశం పార్టీ ( 43వ ఆవిర్భావ దినోత్సవ ) వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఉదయం 9 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ( అట్టహాసంగా వేడుకలు నిర్వహించనున్నారు.
తెలుగు దేశం.పార్టీ.43 వ.ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్గంగా నిర్వహించేందుకు.ఏర్పాట్లు


విజయవాడ, 29 మార్చి (హి.స.)తెలుగుదేశం పార్టీ ( 43వ ఆవిర్భావ దినోత్సవ ) వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఉదయం 9 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ( అట్టహాసంగా వేడుకలు నిర్వహించనున్నారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి పుష్పాంజలి ( ఘటించి ఆవిర్భావ సభను ప్రారంభిస్తారు. ఈ వేడుకల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ , రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని, ఎన్టీఆర్‌ విజయ ప్రస్థానం, సీఎంగా చంద్రబాబు సాధించిన విజయాలకు సంబంధించిన వీడియోలను జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించాలని ఆదేశించింది. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ.. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరుగగా 6 సార్లు అధికారంలో... 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande