హైదరాబాద్, 29 మార్చి (హి.స.) హైదరాబాద్ వేదికగ జరిగిన మూడు రోజుల కియో కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు నేటితో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజేతలకు మెడల్స్ అందించారు. అంతేగాక ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు అందజేసి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి ఎన్నో పోటీలు నిర్వహించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నెలవు కావాలని కోరుకున్నారు. విజేతలను ఉద్దేశించి ఇలాంటి మరిన్ని పోటీలలో విజేతలుగా నిలిచి, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకొని రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్